99 children Heart Surgeries done by Andhra Hospitals in association with Tollywood super star Mahesh Babu.
తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు స్వస్థలం, దత్తత గ్రామం అయిన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో ఆంధ్రా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మే 8 2016 లో ఆ గ్రామంలోని ప్రతి కుటుంబానికి మహేష్ బాబు చేతుల మీదుగా హెల్త్ కార్డులు కూడా పంపిణీ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పలు రకాలుగా ఆ గ్రామంలోని ప్రజలకు ఉచిత వైద్యాన్ని ఏర్పాటు చేస్తూ ఆ ఊరి ప్రజల బాగోగులను చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు ప్రతీ నెల ఉచిత హెల్త్ చెక్ అప్స్, కొంత మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్స్‌ను కూడా నిర్వహిస్తున్నారు.
విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ వారి నిర్వహణలో ఇప్పటివరకు హార్ట్ సర్జరీస్ కు సంబంధించి ఆరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా 99మంది పిల్లలకు ఉచిత గుండె సంబంధిత సర్జరీలు చేశారు.ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను విజయవంతంగా 99మంది పిల్లలకు చేయడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు మహేష్ బాబు.